సోమవారం 25 మే 2020
Sports - Apr 02, 2020 , 14:40:26

ఒకే ఒక్క చాన్స్‌.. ప్లీజ్

ఒకే ఒక్క చాన్స్‌.. ప్లీజ్

అజ్జూభాయ్‌కు మాస్ట‌ర్ రిక్వెస్ట్‌

న్యూఢిల్లీ:  భార‌త క్రికెట్ దిగ్గజం స‌చిన్ ర‌మేశ్ టెండూల్క‌ర్ కెరీర్ తొలినాళ్ల‌లో ఓపెన‌ర్‌గా బ‌రిలో దిగేందుకు అప్ప‌టి కెప్టెన్ అజారుద్దీన్‌ను ఒప్పించిన విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌పెట్టాడు. ఒకే ఒక్క చాన్స్ ఇవ్వ‌మ‌ని.. ఒక‌వేళ విఫ‌ల‌మైతే మ‌ళ్లీ మీ ముందుకు రాన‌ని సార‌థికి మాటిచ్చి ఓపెనింగ్ అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్లు పేర్కొన్నాడు. న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధు గాయ‌ప‌డ్డ స‌మ‌యంలో.. అజ్జూభాయ్‌తో పాటు అప్ప‌టి జ‌ట్టు మానేజ‌ర్ అజిత్ వాడేక‌ర్ వ‌ద్ద‌కు వెళ్లి.. టాపార్డ‌ర్‌లో బ‌రిలో దిగేందుకు అవ‌కాశం ఇవ్వ‌మ‌ని అడిగిన‌ట్లు గురువారం సామాజిక మాధ్య‌మాల ద్వారా స‌చిన్‌ స్ప‌ష్టం చేశాడు. 

`ఆ రోజు హోట‌ల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినప్పుడు నేను ఓపెనింగ్ చేయ‌నున్నాన‌నే విష‌యం నాక్కూడా తెలియదు. గ్రౌండ్‌లో అడుగుపెట్టేస‌రికి అక్క‌డ కెప్టెన్ అజారుద్దీన్‌, మేనేజ‌ర్ వాడ్క‌ర్ ఓపెనింగ్ అంశం గురించి చ‌ర్చించుకుంటున్నారు. గాయం కార‌ణంగా సిద్ధు ఓపెనింగ్ చేసే ప‌రిస్థితి లేదు ఇప్పుడెలా అనుకుంటుండ‌గా.. నాకొక అవ‌కాశం ఇవ్వ‌మ‌ని అడిగా. ఒక‌వేళ విఫ‌ల‌మైతే మ‌ళ్లీ మీ ముందుకు రాన‌ని మాటిచ్చా` అని మాస్ట‌ర్ స్ప‌ష్టం చేశాడు.

అప్ప‌టి వ‌ర‌కు మిడిలార్డ‌ర్‌లో బ్యాటింగ్ చేసిన స‌చిన్.. ఓపెన‌ర్‌గా క్రీజులో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. తొలి 15 ఓవ‌ర్ల ప‌వ‌ర్ ప్లే నిబంధ‌న‌ల‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ ఎడాపెడా బౌండ్రీల‌తో విరుచుకుప‌డ్డాడు. పేస‌ర్ల‌ను ధీటుగా ఎదుర్కొన్న బ్యాటింగ్ లెజండ్ 49 బంతుల్లోనే 82 ప‌రుగులు బాదాడు. అందులో 15 ఫోర్లు, 2 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక అక్క‌డి నుంచి వెనుదిర‌గి చూసుకోని సచిన్ కెరీర్ ఎండింగ్ వ‌ర‌కు ఓపెన‌ర్‌గానే కొన‌సాగి.. లెక్క‌లేన‌న్ని రికార్డులు త‌న పేరిట రాసుకున్న విష‌యం తెలిసిందే. 


logo