శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 07, 2020 , 14:14:25

అత‌డు మూడో స్థానంలో దిగితే ఐపీఎల్‌లో డ‌బుల్ సెంచ‌రీ సాధించ‌గ‌ల‌డు : కేకేఆర్‌

అత‌డు మూడో స్థానంలో దిగితే ఐపీఎల్‌లో డ‌బుల్ సెంచ‌రీ సాధించ‌గ‌ల‌డు : కేకేఆర్‌

ఐపీఎల్ 2020లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున డైనమిక్ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రు ర‌స్సెల్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగ‌నున్నాడ‌ని జట్టు యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, గురువు డేవిడ్ హస్సీ నేతృత్వంలోని కేకేఆర్ యాజ‌మాన్యం వెస్టిండీస్ హిట్ట‌ర్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవ‌డం కోసం మూడో స్థానంలో బ‌రిలోకి దింప‌నున్న‌ట్లు తెలిపారు. 

హస్సీ మాట్లాడుతూ త‌గిన‌న్ని ఓవ‌ర్లు మిగిలుంటే ర‌స్సెల్ టీ20ల్లో డ‌బుల్ సెంచ‌రీ సాధించ‌గ‌ల‌డన్నాడు. ఈ ఫీట్ కేవ‌లం ర‌స్సెల్‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని, వేరే ఏ ఒక్క‌రు ఇలా చేయ‌లేర‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ 2019లో ర‌స్సెల్ 13 ఇన్నింగ్స్‌లో 56.66 స‌గ‌టుతో 510 ప‌రుగులు చేశాడు. బౌలంగ్‌లో 11 వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు. ఈ ఆల్‌రౌండ‌ర్ జ‌ట్టుకు గుండెకాయ లాంటివాడ‌ని హ‌స్సీ అన్నాడు.  డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ సెప్టెంబర్ 23న అబుదాబిలో మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo