మంగళవారం 07 జూలై 2020
Sports - Apr 24, 2020 , 11:19:30

మాస్ట‌ర్‌కు ఐసీసీ శుభాకాంక్ష‌లు

మాస్ట‌ర్‌కు ఐసీసీ శుభాకాంక్ష‌లు

న్యూఢిల్లీ: క‌్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ నేటి (శుక్ర‌వారం)తో 47వ ప‌డిలో అడుగుపెట్టాడు. 24 ఏండ్ల పాటు త‌న బ్యాటింగ్ విన్యాసాల‌తో ప్ర‌పంచాన్ని మైమ‌రిపించిన మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్.. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో పుట్టిన రోజు వేడుక‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. కాగా.. విశ్వ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న మాస్ట‌ర్‌కు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ) శుభాకాంక్ష‌లు తెలిపింది.

`ఆల్‌టైమ్ గ్రేట్ స‌చిన్ టెండూల్క‌ర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. కెరీర్‌లో విజ‌యవంత‌మైన ఆట‌గాడ‌త‌డు. ఈ సంద‌ర్భంగా స‌చిన్ అత్యుత్త‌మ వ‌న్డే ఇన్నింగ్స్‌పై పోల్ నిర్వ‌హిస్తున్నాం` అని ఐసీసీ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపింది. 


logo