శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Jan 18, 2020 , 03:05:06

సఫారీలకు షాక్‌

సఫారీలకు షాక్‌
  • - అండర్‌-19 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో ఓటమి

కింబర్లే: అండర్‌-19 ప్రపంచకప్‌ ఆరంభ పోరులో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టుకు షాక్‌ తగిలింది. శుక్రవారం ఇక్కడ ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సఫారీ జట్టు ఓటమి పాలైంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా అండర్‌-19 జట్టు 29.1 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘన్‌ స్పిన్నర్‌ షఫీఖుల్లా గఫారి (6/15) ధాటికి.. బ్రైస్‌ పర్సన్స్‌ (40), బ్యూఫోర్ట్‌ (25), గెరాల్డ్‌ (38) మినహా.. తక్కినవారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం ఇబ్రహీం జద్రాన్‌ (52), ఇమ్రాన్‌ (57) అర్ధశతకాలతో కదం తొక్కడంతో ఆఫ్ఘనిస్థాన్‌ 25 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఆరు వికెట్లతో అదరగొట్టిన షఫీఖుల్లాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.


logo