బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 24, 2020 , 00:56:23

జోరు సాగనీ..

జోరు సాగనీ..
  • నేడు న్యూజిలాండ్‌తో తలపడనున్న యువ భారత్‌
  • అండర్‌-19 ప్రపంచకప్‌
  • మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

బ్లూమ్‌ ఫాంటైన్‌ (దక్షిణాఫ్రికా): అండర్‌-19 ప్రపంచకప్‌లో జోరుమీదున్న యువ భారత్‌.. చివరి లీగ్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే క్వార్టర్స్‌ బెర్త్‌ దక్కించుకున్న ప్రియం గార్గ్‌ సేన.. గ్రూప్‌-‘ఎ’లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విజృంభించిన భారత అండర్‌-19 జట్టు.. 90 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ఇక రెండో మ్యాచ్‌లో బౌలింగ్‌లో విశ్వరూపం ప్రదర్శించిన మన కుర్రాళ్లు తొలిసారి మెగాటోర్నీ బరిలో దిగిన జపాన్‌ను 41 పరుగులకే పరిమితం చేసి 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించారు. అదే ఊపు కొనసాగిస్తూ.. న్యూజిలాండ్‌నూ మట్టికరిపించి అజేయంగా నాకౌట్‌కు దూసుకెళ్లాలని భావిస్తున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు న్యాయం చేస్తూ వరుసగా రెండు ఘన విజయాలు ఖాతాలో వేసుకున్న యువ భారత్‌ 4 పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది.


logo