మంగళవారం 26 జనవరి 2021
Sports - Jan 01, 2021 , 02:24:23

విలియమ్సన్‌ @ 1

విలియమ్సన్‌ @ 1

దుబాయ్‌: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరాడు. 2015లో మొదటిసారి టాప్‌ ర్యాంక్‌కు చేరిన విలియమ్సన్‌ (890) ఐదేండ్ల తర్వాత తిరిగి అగ్రస్థానాన్ని అధిరోహించాడు. పాకిస్థాన్‌తో తొలి టెస్టు (129, 21) ప్రదర్శన ద్వారా విలియమ్సన్‌ 13 రేటింగ్‌ పాయింట్లు సాధించి నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరితే.. భారత్‌తో సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న స్మిత్‌ (877) మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. కోహ్లీ (879) రెండో ర్యాంక్‌లోనే ఉన్నాడు. భారత స్టాండిగ్‌ కెప్టెన్‌ రహానే ఆరో స్థానానికి చేరాడు.


logo