గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Feb 18, 2020 , 00:18:00

10కి పడిన కోహ్లీ

10కి పడిన కోహ్లీ

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 10వ ర్యాంకుకు పడిపోగా.. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను ఐసీసీ  సోమవారం వెల్లడించింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 136పరుగులతో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(687పాయింట్లు) రాణించడంతో విరాట్‌ కోహ్లీ (673) ఓ మెట్టు దిగి పదో స్థానంలో నిలవాల్సి వచ్చింది. భారత స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(662) 11వ ర్యాంకులో కొనసాగగా.. పాకిస్థాన్‌ స్టార్‌ బాట్స్‌మన్‌ బాబర్‌ ఆజం టాప్‌ ర్యాంకును నిలబెట్టుకున్నాడు.బౌలింగ్‌ విభాగంలో భారత అగ్రశ్రేణి పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా 12వ ర్యాంకులో విండీస్‌ పేసర్‌ కాట్రెల్‌తో సంయుక్తంగా నిలిచాడు. ఆఫ్ఘన్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 


logo