శనివారం 06 మార్చి 2021
Sports - Feb 15, 2021 , 19:33:37

ఐసీసీ ర్యాంకింగ్స్‌: రాహుల్‌ 2.. కోహ్లీ 7

ఐసీసీ ర్యాంకింగ్స్‌: రాహుల్‌ 2.. కోహ్లీ 7

దుబాయ్‌: ఐసీసీ మెన్స్‌ టీ20 ప్లేయర్‌ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌(816 రేటింగ్‌ పాయింట్లు)  ఒక స్థానం ఎగబాకి రెండో ర్యాంకుకు చేరాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్‌ తబ్రైజ్‌ షంషీ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు రెండు సాధించాడు. బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌(915 రేటింగ్‌ పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా టీమ్‌ ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(697) ఏడో ర్యాంకులో ఉన్నాడు. టీ20 ఆల్‌రౌండర్‌, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఏ ఒక్క భారత ఆటగాడికి చోటు దక్కలేదు. 

VIDEOS

logo