మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Sep 27, 2020 , 15:53:42

కొవిడ్‌ ఎఫెక్ట్‌.. ఐసీసీ కార్యాలయం మూసివేత!

కొవిడ్‌ ఎఫెక్ట్‌.. ఐసీసీ కార్యాలయం మూసివేత!

న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ కార్యాలయం మహమ్మారి కారణంగా మూతపడింది. కొంత మంది సిబ్బంది పాజిటివ్‌గా పరీక్షించడంతో పోట్రోకాల్స్‌లో కారణంగా శుభ్రం చేసేందుకు కొద్ది రోజుల పాటు మూసే ఉండనుంది. అప్పటి వరకు సిబ్బంది వర్క్‌ఫ్రం హోం చేయనున్నారు. అయితే ఐసీసీ నుంచి అధికార సమాచారం లేకపోయినా బోర్డు సీనియర్‌ సభ్యుడు ఒకరు కొన్ని పాజిటివ్‌ కేసులు ఉన్నాయని ధ్రువీకరించారు. పీటీఐ అందించిన సమాచారం మేరకు.. ఐసీసీ సిబ్బంది అందరూ పోట్రోకాల్స్‌ ప్రకారం ఐసోలేటింగ్‌ చేస్తున్నారు. యూఏఈ ప్రభుత్వం ఆరోగ్య భద్రతా నిబంధనల ప్రకారం ఆఫీసు ఆవరణను పూర్తిగా పనిచేసేలా చేయడానికి, కొన్ని రోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని ఐసీసీ సిబ్బంది భావిస్తున్నారు.

ప్రస్తుతం దుబాయి కేంద్రంగా ఆరు ఐపీఎల్ జట్లు ఉన్నాయి. దుబాయి స్పోర్ట్స్ సిటీలోఉన్న ఐసీసీ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్ సదుపాయాలను క్రికెట్లరు వినియోగించుకుంటున్నారు. అయితే ‘ఐసీసీ అకాడమీ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని, ఇది ఆఫీసును హెడ్‌ క్వార్టర్స్‌కు ఆనుకొని లేదని, ప్రాక్టీస్ సెషన్‌కు ఐసీసీ సిబ్బంది ఎవరూ హాజరు కారన్నారు. దీంతో ఐపీఎల్‌ జట్లకు ఎలాంటి సమస్యలేదని బోర్డు సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే దుబాయికి వెళ్లిన చెన్నైకి చెందిన క్రికెట్లతో పాటు బీసీసీఐ అధికారితో పాటు ఢిల్లీకి చెందిన ఫిజియో ఒకరు మహమ్మారి బారినపడి కోలుకున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.