సోమవారం 25 మే 2020
Sports - Mar 29, 2020 , 12:36:23

అప్పుడు హీరో.. ఇప్పుడు రియ‌ల్ హీరో: ఐసీసీ ప్ర‌శంస‌లు

అప్పుడు హీరో.. ఇప్పుడు రియ‌ల్ హీరో: ఐసీసీ ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్‌: టీమిండియా మాజీ బౌల‌ర్ జోగింద‌ర్ శ‌ర్మ గుర్తు ఉన్నాడా.  2007లో జరిగిన టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఉత్కంఠ‌భ‌రిత‌మైన చివ‌రి ఓవ‌ర్‌ను జోగింద‌రే బౌల్ వేశాడు.  అద్భుతంగా ఆ ఓవ‌ర్‌ను వేసిన జోగింద‌ర్ అప్ప‌ట్లో హీరో అయ్యాడు. ఇప్పుడు పోలీస్ ఆఫీస‌ర్‌గా కూడా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ ప్ర‌శంస‌లు పొందుతున్నాడు.  హ‌ర్యానా డీఎస్‌పీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న జోగింద‌ర్‌.. కోవిడ్‌19 నియంత్ర‌ణ‌లో త‌న క‌ర్త‌వ్యాన్ని సంపూర్ణంగా అమ‌లు చేస్తున్నాడు. 

2007 టీ20 ఫైన‌ల్లో కీల‌క‌మైన మిష్బా ఉల్ హ‌క్ వికెట్ తీసిన జోగింద‌ర్‌.. భారత్‌కు తీయ‌ని విక్ట‌రీని అందించాడు.  ఆ విక్ట‌రీతో ఇండియా తొలి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచింది.  ఇప్పుడు డీఎస్పీగా ప‌నిచేస్తున్న జోగింద‌ర్‌పై అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి ప్ర‌శంస‌లు కురిపిస్తున్న‌ది.  2007లో అత‌ను హీరో, 2020లోనూ రియ‌ల్ హీరోగా జోగింద‌ర్ నిలిచాడ‌ని ఐసీసీ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నది.  టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో హీరోగానే నిలిచినా.. ఆ త‌ర్వాత జోగింద‌ర్ కేరీర్ త్వ‌ర‌గానే ముగిసింది.  77 ఫ‌స్ట్‌క్లాస్ గేమ్స్ ఆడిన అత‌ను 2018లో రిటైర్ అయ్యాడు. క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధించిన సంద‌ర్భంగా ఇప్పుడు పోలీసు ఆఫీస‌ర్‌గా అత‌ను విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు.


logo