న్యూఢిల్లీ: ప్రస్తుతం జీవన వ్యయం, విద్యాభ్యాసం ఖర్చు క్రమంగా పెరుగుతున్నాయి. చౌకగా ఉన్నత విద్యాభ్యాసం కష్టసాధ్యంగా మారింది. భారతీయుల్లో అత్యధికులు తమ వార్షికాదాయంలో 13 శాతం తమ పిల్లల ఉన్నత విద్యావసరాలకు వినియోగిస్తున్నారు. ఒక కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఉన్నత విద్యాభ్యాసానికి ఖర్చు గణనీయంగా పెరిగిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత విద్యాభ్యాస అవసరాలను తీర్చుకోవడానికి రుణాల కోసం బ్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. భారతదేశంలోని, విదేశాల్లోని కొన్ని విద్యాసంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కోరుకునే విద్యార్థులకు దాదాపు అన్ని బ్యాంకులు విద్యారుణాలు మంజూరు చేస్తున్నాయి.
విద్యారుణాలు తల్లిదండ్రులు గానీ, విద్యార్థులు కూడా తీసుకోవచ్చు. విద్యార్థులు తమ ఉన్నత విద్యాకోర్సులను అభ్యసించిన తర్వాత ఉద్యోగం సంపాదించుకుని రుణం చెల్లించడానికి ప్రాధాన్యం ఇస్తారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు 6.8, 6.85, 6.85 శాతం వడ్డీకి విద్యార్థులకు ఉన్నతవిద్యా కోర్సులను అభ్యసించడానికి విద్యారుణాలు ఇస్తున్నాయి. ఇక ప్రైవేట్ బ్యాంకులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 9.55, 9.70, 10.50 శాతం వడ్డీపై విద్యారుణాలందిస్తున్నాయి.
అన్నివేళలా విద్యారుణాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు వసూలు చేసిన వడ్డీరేట్లు తక్కువ. ఎన్బీఎఫ్సీలు ఇచ్చే రుణాలు రిస్క్‌తో కూడుకున్నది. ఎస్బీఐ 6.85 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 9.55 శాతం వడ్డీరేటుపై విద్యారుణాలు మంజూరు చేస్తున్నాయి.
విద్యారుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీరేట్లు ఇలా ఉన్నాయి:
బ్యాంక్………………………… వడ్డీరేటు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.80
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.85
బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.85
బ్యాంక్ ఆఫ్ బరోడా – 6.85
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 6.85
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 6.90
ఐడీబీఐ బ్యాంక్ – 6.90
కెనరా బ్యాంక్ – 6.90
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 7.05
ఇండియన్ బ్యాంక్ – 7.15
విద్యారుణం, వ్యక్తిగత రుణం చెల్లింపులకు గడువు ఉంటుంది. వ్యక్తిగత రుణాల చెల్లింపునకు ఐదేండ్ల గడువు ఉండాలి. కొన్ని బ్యాంకులు ఆరేండ్ల నుంచి ఏడేండ్ల వరకు ఉండాలి. విద్యా రుణాలకు గరిష్ఠంగా 15 ఏండ్ల గడువు ఉంటుంది.
పన్ను మినహాయింపులు ఇలా
విద్యారుణాలను చెల్లిస్తున్నప్పుడు రుణ గ్రహీతలకు ఐటీ చట్టంలోని 80ఈ సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, రుణం తీసుకున్న ఎనిమిదేండ్ల తర్వాత రుణ వాయిదాలు చెల్లింపులు ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇక వ్యక్తిగత రుణాల చెల్లింపులకు పన్ను మినహాయింపులు వర్తించవు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ముంబైలో ఇల్లు కొన్న డీమార్ట్ యజమాని.. ఇంటి ధర ఎంతంటే..?
డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఈ అలారం మోగుతుంది.. సిద్ధం చేసిన మిలటరీ
ఈ పరిస్థితుల్లో ఇండియా నుంచి దిగుమతులు చేసుకోలేం: ఇమ్రాన్‌ఖాన్
లైవ్‌లో రిపోర్టర్ మైక్రోఫోన్ ఎత్తుకెళ్లిన కుక్క
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
షోఫియాన్‌లో ఎన్కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం
ఆర్మీ బలోపేతం వెనుక జనరల్ మానెక్షా అవిరళ కృషి.. చరిత్రలో ఈరోజు
రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్