సోమవారం 25 మే 2020
Sports - May 23, 2020 , 19:59:57

రెండు నెలల ప్రాక్టీస్‌ తప్పనిసరి: ఐసీసీ

రెండు నెలల ప్రాక్టీస్‌ తప్పనిసరి: ఐసీసీ

దుబాయ్‌: విరామం అనంతరం టెస్టు క్రికెట్‌ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యేందుకు బౌలర్లకు రెండు మూడు నెలల సమయం పట్టొచ్చని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అంచనా వేస్తున్నది. టోర్నీల పునఃప్రారంభానికి శుక్రవారం మార్గనిర్దేశకాలు విడుదల చేసిన ఐసీసీ.. పేస్‌ బౌలర్లు గాయాల బారిన పడకుండా ఉండాలంటే ప్రాక్టీస్‌ తప్పనిసరి అని పేర్కొంది. ‘రెండు మూడు నెలల శిక్షణ అనంతరమే టెస్టులు సాధ్యపడతాయి. పూర్వస్థితిలో బౌలింగ్‌ చేసేందుకు పేసర్‌కు కనీసం నెల రోజుల గడువైనా కావాలి. అప్పుడే అతడు లెంగ్త్‌ పట్టుకోగలడు. అలా కాకుండా తొందరపడి సుదీర్ఘ ఫార్మాట్‌లో బరిలోదిగితే గాయాల పాలయ్యే చాన్స్‌లు అధికం’అని ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.


ఇక క్రికెట్‌ తిరిగి ప్రారంభం కావాలని ఆతృతగా ఎదురుచూస్తున్న ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు.. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు రెడీ అని ప్రకటించింది. ఐసీసీ మార్గదర్శకాలకు లోబడి ద్వైపాక్షిక సిరీస్‌ నిర్వహిచాలని ఈసీబీ యోచిస్తున్నది. ఇందులో భాగంగానే తమ పేసర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నది. ఇప్పటికే స్టువర్ట్‌ బ్రాడ్‌, క్రిస్‌ వోక్స్‌ మైదానంలో చెమటోడ్చుతున్న విషయం తెలిసిందే. మరోవైపు టీమ్‌ఇండియాతో టీ20 సిరీస్‌ ఆడేందుకు శ్రీలంక సన్నాహాలు మొదలెట్టింది. 


logo