శనివారం 19 సెప్టెంబర్ 2020
Sports - Aug 06, 2020 , 00:20:45

టాప్‌లోనే కోహ్లీ

 టాప్‌లోనే కోహ్లీ

దుబాయ్‌: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 871 పాయింట్లతో కోహ్లీ టాప్‌లో ఉంటే.. 855 పాయింట్లతో రోహిత్‌ అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ (829) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌ విభాగంలో భారత స్పీడ్‌ స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా (719) రెండో ర్యాంక్‌లో ఉండగా.. న్యూజిలాండ్‌ పేసర్‌ బౌల్ట్‌ (722) టాప్‌లో ఉన్నాడు. ఐసీసీ కొత్తగా ప్రవేశ పెట్టిన వన్డే ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో ఇంగ్లండ్‌ 20 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.


logo