బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 04, 2020 , 00:31:45

బ్రిటన్‌కు కాసులపంట

బ్రిటన్‌కు కాసులపంట

లండన్‌: గతేడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌.. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకు కాసుల పంట కురిపించింది. టోర్నీ వల్ల మొత్తం 350మిలియన్‌ పౌండ్లు ఆర్థిక వ్యవస్థకు చేకూరింది. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఊహించిన దాని కంటే ఎక్కువ మంది అభిమానులు ఇంగ్లండ్‌కు రావడంతో వివిధ మార్గాల్లో ఆదాయం సమకూరింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ టోర్నీని 160కోట్ల మంది వీక్షించగా.. డిజిటల్‌ కంటెంట్‌కు 406కోట్ల వీక్షణలు వచ్చాయి. వన్డే ప్రపంచకప్‌ అన్ని విధాల విజయవంతమైందని ఐసీసీ సీఈవో షాహ్నీ చెప్పారు. 


logo