ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 07, 2020 , 03:18:03

నేడు ఐసీసీ సమావేశం

నేడు ఐసీసీ సమావేశం

న్యూఢిల్లీ: కరో నా వైరస్‌ మహమ్మారి విజృంభణతో వాయిదా ప డ్డ టీ20 ప్రపంచకప్‌ను తిరిగి ఎప్పు డు నిర్వహించాలో నిర్ణయించేందుకు శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించనుంది. ఈ చర్చలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొననున్నారు. 2021లో భారత్‌లో పొట్టి ప్రపంచకప్‌ జరుగాల్సి ఉన్న నేపథ్యంలో.. ఇటీవల వాయిదా వేసిన టీ20 ప్రపంచకప్‌ను 2022లో ఆసీస్‌ వేదికగా నిర్వహించడంపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు వచ్చే ఏడాది న్యూజిలాండ్‌ వేదికగా జరుగాల్సి ఉన్న మహిళల వన్డే ప్రపంచకప్‌పై కూడా చర్చ సాగనుంది. ఐసీసీ చైర్మన్‌ ఎన్నిక నామినేషన్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. 


logo