మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 00:17:16

ఐసీసీ మార్గదర్శకాలు విడుదల

ఐసీసీ మార్గదర్శకాలు విడుదల

దుబాయ్‌: క్రికెట్‌ పునరుద్ధరణ కోసం ఐసీసీ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రధాన వైద్యాధికారిని నియమించుకోవడం, 14 రోజుల ప్రి మ్యాచ్‌ ఐసోలేషన్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేయాలని సూచించింది. ‘కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎదుర్కొనే విషయంలో మార్గదర్శకాలను అందరూ విధిగా పాటించాల్సిందే. ప్రభుత్వ నిబంధనలు పాటించడంలో ప్రధాన వైద్యాధికారి బాధ్యతగా వహించాలి. శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడంలో బయో సేఫ్టీ ప్రణాళికను అమలు చేయాలి. ప్రి మ్యాచ్‌ ఐసోలేషన్‌కు ముందు ప్రతి ఒక్క ఆటగాని శరీర ఉష్ణోగ్రతలు చెక్‌ చేయాలి’ అని ఐసీసీ పేర్కొంది. 


logo