శుక్రవారం 10 జూలై 2020
Sports - May 06, 2020 , 22:36:47

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ భ‌వితవ్యం తేలేనా..!

పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ భ‌వితవ్యం తేలేనా..!

ముంబై: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టికే ఈ ఏడాది జ‌రుగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌.. 2021కి వాయిదా ప‌డ‌గా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ అస‌లు జ‌రుగుతుందో లేదో అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  ఈ నేప‌థ్యంలో కొవిడ్‌-19 ప్ర‌భావంతో ఏడాది చివ‌ర్లో జ‌రుగాల్సి ఉన్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ కూడా స‌జావుగా సాగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. అయితే ఈ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులిచ్చేందుకు శుక్ర‌వారం రోజు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి (ఐసీసీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స‌మావేశం కానున్నాయి. 

ఏప్రిల్ 23న జ‌రిగిన సీఈవోల స‌మావేశంలో వేచి చూడ‌ట‌మే ఉత్త‌మ‌మ‌ని నిర్ణ‌యించిన ఐసీసీ.. తాజాగా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నే ఆస‌క్తి నెల‌కొంది. ప‌రిస్థితుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష నిర్వ‌హించ‌డంతో పాటు మెగాటోర్నీకి ఆతిథ్య‌మిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియాతో సంప్ర‌దింపులు కొన‌సాగిస్తున్నామ‌ని ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. logo