మంగళవారం 19 జనవరి 2021
Sports - Dec 01, 2020 , 00:20:24

లక్ష్యం నెరవేరనట్టే

 లక్ష్యం నెరవేరనట్టే

  • టెస్టు చాంపియన్‌షిప్‌పై ఐసీసీ చైర్మన్‌ బార్క్‌లే 

న్యూఢిల్లీ: సంప్రదాయ ఫార్మాట్‌కు ప్రజాదరణ పెంచాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) అనుకున్న విధం గా సాగడం లేదని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నూతన చైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే అభిప్రాయపడ్డాడు. చాంపియన్‌షిప్‌ నిర్దేశిత ధ్యేయాన్ని సాధించలేకపోయిందని, కరోనా వైరస్‌ వల్ల కూడా చాలా కుదించాల్సి వస్తున్నదని తెలిపాడు. డబ్ల్యూటీసీలో భాగమైన అధిక టెస్టు సిరీస్‌లు కరోనా వైరస్‌ వల్ల రద్దు కాగా జట్లకు పాయింట్ల పంపిణీ విషయంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ  నేపథ్యంలో టెస్టు చాంపియన్‌షిప్‌పై బార్క్‌లే సోమవారం వర్చువల్‌ మీడియా సమావేశం నిర్వహించారు.