సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 12, 2020 , 00:15:19

మహిళల వన్డే ప్రపంచకప్‌లో రిజర్వ్‌డేలు

మహిళల వన్డే ప్రపంచకప్‌లో రిజర్వ్‌డేలు

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ వేదికగా వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ బుధవారం విడుదలైంది. ఫిబ్రవరి 6న మొదలయ్యే మెగాటోర్నీ మార్చి 7న ముగియనుంది. మొత్తం ఆరు వేదికలు ఈడెన్‌పార్క్‌, బే ఓవల్‌, సెడాన్‌, యూనివర్సిటీ ఓవల్‌, బేసిన్‌ రిజర్వ్‌, హాగ్లె ఓవల్‌ ప్రపంచకప్‌ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నాయి. ఇదిలా ఉంటే వన్డే  ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉండేలా ఐసీసీ షెడ్యూల్‌ను రూపొందించింది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో వర్షం కారణంగా సెమీస్‌లో ఇంగ్లండ్‌ నిష్క్రమించడం, భారత్‌ ఫైనల్‌కు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీల్లో నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌డే లేకపోవడంపై పలువురు ఐసీసీని తప్పుబట్టారు. 


logo