వాషింగ్టన్: జమైకా స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు.2017లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్..ఒక ప్రమోషన్ ఈవెంటులో పరిగెత్తేందుకు ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే తాను ఎప్పుడు పోటీపడే 100మీ, 200మీ రేసులో కాకుండా 800మీ పరుగులో బరిలోకి దిగబోతున్నాడు. ట్రాక్‌కు వీడ్కోలు పలికినా..తనలో సత్తా మిగిలే ఉందని చెబుతూ ప్రాక్టీస్‌ను 2.05 నిమిషాల్లో ముగించాడు.