బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 19:50:29

మీ మద్దతును ఇలాగే కొనసాగిస్తే మరిన్ని పురస్కారాలు సాధిస్తా : రోహిత్‌శర్మ

మీ మద్దతును ఇలాగే కొనసాగిస్తే మరిన్ని పురస్కారాలు సాధిస్తా : రోహిత్‌శర్మ

ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును గెలుచుకున్నందుకు గాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, అనుచరులకు భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ శనివారం కృతజ్ఞతలు తెలిపాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ తరువాత ఈ అవార్డును గెలుచుకున్న నాల్గో భారత క్రికెటర్‌గా నిలిచిన రోహిత్.. ఖేల్ రత్న అవార్డు రావడం ఎంతో గౌరవ ప్రదంగా భావిస్తున్నానని, రాబోయే రోజుల్లో మరింత కష్టపడి దేశం గర్వపడేలా చేస్తానని హామీ ఇచ్చాడు. 

‘నాకు మద్దతుగా ఉన్న అభిమానులు, అనుచరులందరికీ చాలా ధన్యవాదాలు. ఇది అద్భుతమైన రైడ్’ అని రోహిత్‌ ట్విట్టర్‌లో వీడియో సందేశం ద్వారా చెప్పాడు. ‘భారతదేశంలో ఇలాంటి క్రీడా గౌరవం పొందడం గొప్ప హక్కు. దీని ద్వారా నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను మీ అందరికీ రుణపడి ఉన్నాను. మీ మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. మీ మద్దతును ఇలాగే కొనసాగిస్తే మరెన్నో పురస్కారాలను దేశానికి తీసుకువస్తానని నేను హామీ ఇస్తున్నాను.’ అని రోహిత్‌ అన్నాడు. 

రోహిత్ ప్రపంచ కప్‌ ఒకే ఎడిషన్‌లో ఐదు వన్డే సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. భారత గడ్డపై అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo