ఆదివారం 12 జూలై 2020
Sports - Jun 16, 2020 , 23:17:57

టోక్యోకు అర్హ‌త సాధిస్తా: సాక్షి

టోక్యోకు అర్హ‌త సాధిస్తా:  సాక్షి

న్యూఢిల్లీ: ప‌్ర‌తిష్ఠాత్మ‌క టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించే స‌త్తా త‌న‌లో ఉంద‌ని భార‌త స్టార్ రెజ్ల‌ర్ సాక్షి మాలిక్ పేర్కొంది. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య ప‌తకం నెగ్గి.. ఈ ఘ‌న‌త సాధించిన ఏకైక భారత మ‌హిళా బాక్స‌ర్‌గా చ‌రిత్ర‌కెక్కిన సాక్షి.. గ‌త కొంత కాలంగా స్థాయికి త‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం లేదు. జాతీయ ట్ర‌య‌ల్స్‌లో సోన‌మ్ మాలిక్ చేతిలో ఒక‌టికి రెండు సార్లు ఓట‌మి పాలై టోక్యో క్వాలిఫ‌యింగ్ టోర్నీల‌కు వెళ్లే అవ‌కాశాల‌ను సంక్లిష్టం చేసుకుంది. అయితే త‌న‌లో ఇంకా స‌త్తా త‌గ్గ‌లేద‌ని ఈ 27 ఏండ్ల రెజ్ల‌ర్ చెప్పింది.

`తిరిగి ఎలా పుంజుకోవాలో నాకు తెలుసు. నేష‌న‌ల్ ట్ర‌య‌ల్స్‌లో ఓడిన రెండు బౌట్‌ల‌లోనూ ఆఖ‌రి సెకండ్ల‌లో ఫ‌లితాలు తారుమార‌య్యాయి. అప్ప‌టి వ‌ర‌కు పైచేయి సాధించిన నేను ఇక అయిపోయిందిగా అనుకున్న స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి ముందంజ వేసింది. ఇక‌పై ఇలాంటి త‌ప్పులు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా. మ‌రోసారి జాతీయ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తే అందులో స‌త్తాచాటి ఆ త‌ర్వాత ఆసియా ఒలింపిక్ ట్ర‌య‌ల్స్‌, వ‌ర‌ల్డ్ ఒలింప‌క్ ట్ర‌య‌ల్స్ ద్వారా టోక్యోకు అర్హ‌త సాధిస్తా` అని సాక్షి మాలిక్ పేర్కోంది.


logo