థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆడుతా: సింధు

న్యూఢిల్లీ: జనవరిలో జరిగే థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీల్లో బరిలోకి దిగుతానన్న నమ్మకముందని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చెప్పింది. కొత్త రకం కరోనా వైరస్‌తో బ్రిటన్ వణికిపోతుండగా.. ప్రస్తుతం సింధు లండన్‌లోనే ఉంది. బ్రిటన్ నుంచి విమాన రాకపోకలను భారత్‌తో పాటు చాలా దేశాలు నిలిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింధు అక్కడి నుంచి రావడంపైనా సందిగ్ధత నెలకొంది. దీంతో ఈ విషయంపై ప్రపంచ చాంపియన్ స్పందించింది.
‘నేను అక్కడికి(థాయ్‌లాండ్) జనవరి మొదటి వారంలో చేరుకునేలా ప్రణాళిక రచిస్తున్నా. ప్రస్తుతం బ్రిటన్ నుంచి ప్రయాణాలపై థాయ్‌లాండ్‌లో నిషేధం లేదు. అందుకే నేను ముందుగా దోహా వెళతా. గల్ఫ్ మార్గాన్ని ఎంపిక చేసుకొని థాయ్‌లాండ్ చేరుకుంటా’ అని సింధు తెలిపింది.
లండన్‌లో బయో బబుల్‌లో తన ట్రైనింగ్ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్నదని ఆమె చెప్పింది. జనవరి 12 నుంచి జరుగాల్సిన థాయ్‌లాండ్ ఓపెన్‌తో వచ్చే ఏడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభం కానుంది. సింధు చివరగా ఈ ఏడాది మార్చిలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంది.
తాజావార్తలు
- పాతబస్తీలో పేలిన సిలిండర్.. 13 మందికి గాయాలు
- అరుణాచల్‌ప్రదేశ్ మాజీ గవర్నర్ కన్నుమూత
- ఈ రాశులవారికి.. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..