సోమవారం 08 మార్చి 2021
Sports - Feb 09, 2021 , 16:25:27

ముందే వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా.. టీమిండియాకు కేపీ పంచ్‌

ముందే వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా.. టీమిండియాకు కేపీ పంచ్‌

చెన్నై: ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఓడిన త‌ర్వాత ఆ టీమ్ మాజీ ప్లేయ‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్‌.. కోహ్లి సేన‌కు హిందీలో పంచ్ ఇచ్చాడు. మా టీమ్‌తో జాగ్ర‌త్త అని ముందే వార్నింగ్ ఇచ్చాను గుర్తుందా అని కేపీ హిందీలో ట్వీట్ చేశాడు. గ‌త నెల‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా గెలిచిన త‌ర్వాత పీట‌ర్స‌న్ ఓ ట్వీట్ హెచ్చ‌రిక పంపాడు. మ‌రీ అంత‌గా సంబ‌రాలు చేసుకోకండి.. రెండు వారాల్లో అస‌లైన టీమ్ వ‌స్తోంది జాగ్ర‌త్త అని గ‌త నెల 19న కేపీ ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెల‌వ‌గానే నేను ముందే చెప్పాను గుర్తుందా అన్న‌ట్లుగా మ‌రో ట్వీట్ చేయ‌డం విశేషం. 

VIDEOS

logo