శనివారం 16 జనవరి 2021
Sports - Nov 23, 2020 , 18:32:05

నా తండ్రి క‌ల‌ను నెర‌వేరుస్తా: సిరాజ్‌

నా తండ్రి క‌ల‌ను నెర‌వేరుస్తా: సిరాజ్‌

సిడ్నీ: ఇండియ‌న్ టీమ్‌కు ఆడి, దేశాన్ని గ‌ర్వించేలా చేయాల‌న్న త‌న తండ్రి క‌ల‌ను నెర‌వేర్చ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అన్నాడు టీమిండియా పేస్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్. వ‌చ్చే ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణిస్తాన‌ని చెప్పాడు. శుక్ర‌వారం సిరాజ్ తండ్రి హైద‌రాబాద్‌లో క‌న్నుమూశాడు. అత‌ను ఇండియాకు తిరిగి రావ‌డానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పింది. అయితే సిరాజ్ మాత్రం టీమ్‌తోనే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. నా తండ్రినే కాదు నా స‌పోర్ట‌ర్‌ను కూడా కోల్పోయాను. నేను ఇండియ‌న్ టీమ్‌కు ఆడి, దేశాన్ని గ‌ర్వించేలా చేయ‌డం మా నాన్న క‌ల‌. ఆ క‌ల‌ను నేను నెర‌వేర్చాల‌ని అనుకుంటున్నాను అని సిరాజ్ బీసీసీఐ.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. త‌న తండ్రి ఈ లోకంలో లేక‌పోయినా, త‌న గుండెల్లో ఉన్నాడ‌ని అత‌న‌న్నాడు. త‌న త‌ల్లితో మాట్లాడాన‌ని, ఆమె కూడా త‌న తండ్రి క‌ల నెర‌వేర్చాలని చెప్పింద‌ని ఈ సంద‌ర్భంగా సిరాజ్ చెప్పాడు. ఈ క‌ష్ట  స‌మ‌యంలో ఇండియ‌న్ టీమ్ స‌భ్యులు ఒక కుటుంబంలా త‌న‌కు అండ‌గా నిలిచార‌ని సిరాజ్ అన్నాడు. ధైర్యంగా ఉండి, త‌న తండ్రి క‌ల నెర‌వేర్చాల్సిందిగా విరాట్ భాయ్ ప్రోత్స‌హించాడ‌ని తెలిపాడు.