బుధవారం 05 ఆగస్టు 2020
Sports - Jul 14, 2020 , 13:09:14

నేను విరాట్‌కు చెప్పాను : గంగూలీ

నేను విరాట్‌కు చెప్పాను : గంగూలీ

  • అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ సిరీస్‌ నేపథ్యంలో మాట్లాడిన దాదా

ఇంకా కొన్ని నెలల్లో భారత్‌ క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు మూడు టీ 20 మ్యాచ్‌ల సరీస్‌ కోసం అక్టోబర్‌లో ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఇరు జట్లు తరువాత 4 టెస్ట్ మ్యాచ్ సిరీస్‌, మూడు వన్డే సిరీస్లతో తలపడనున్నాయి. డిసెంబర్ 3 నుంచి ది గబ్బాలో సిరీస్‌లు జరుగనున్నాయి. చివరిసారి కోహ్లీ జట్టు ఆస్ట్రేలియాను సందర్శించినప్పుడు, 2-1తో భారత్ సిరీస్ గెలిచినందున వారు చరిత్రను తిరగ రాశారు.  దేశంలో టెస్ట్ సిరీస్ గెలిచిన మొదటి ఆసియా దేశంగా నిలిచింది.

ఈఏడాది ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టులోకి తిరిగి రావడంతో జట్టు  బలం పుంజుకుంది. ఆస్ట్రేలియా కూడా జట్టు బాలాలు, బలహీనతలను బేరీజు చేసుకొని బరిలోకి దిగాలని యోచిస్తోంది. 

ఈ సిరీస్ గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల మాట్లాడారు. తాను ఇప్పటికే కోహ్లీతో మాట్లాడానని, ఈ ఏడాది ఆస్ట్రేలియాలో భారత్‌ గెలవాలని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘నేను విరాట్‌కు చెప్పాను’ అని గంగూలీ ఇండియా టుడేకు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

‘‘ విరాట్ కోహ్లీ.. నీతో పాటు జట్టు ప్రమాణాలు కూడా పటిష్టంగా ఉన్నాయి. మీరు ఆడటానికి గ్రౌండ్‌లో దిగినప్పుడు, మీ ఆటను టీవీలో చూస్తున్నప్పుడు ఆస్ట్రేలియాతో బాగా ఆడుతున్నారని నేను ఆశించవద్దు. మీరు గెలుస్తారని నేను ఆశించాలి. ఎందుకంటే మీరు ప్రమాణాలను నిర్ణయించారు. మీరు గెలుస్తారని నేను ఖచ్చితంగా అనుకోవాలి’’ అని కోహ్లీతో అన్నట్లు తెలిపారు. 

‘‘నేను కోహ్లీతో సన్నిహితంగా ఉన్నాను. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ గురించి ఎల్లప్పుడూ తెలుసుకుంటున్నాను. షమీ, బూమ్రా, ఇషాంత్‌ శర్మ, హార్దీక్‌ పాండ్యా.. బౌలర్లు ఉత్తమ ప్రదర్శనకు సిద్ధంగా ఉండాలి. ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినప్పుడు వారి ఫిట్‌నెస్‌తో మ్యాచ్ అగ్రస్థానంలో ఉండాలి” అని గంగూలీ అన్నారు.  "ఇది కఠినమైన సిరీస్ అవుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టు కూడా బలంగా ఉంది. కానీ మేము గెలుస్తాం అనే నమ్మకం ఉంది. ఎందుకంటే మావాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయగలరు’’ అని అన్నారాయన. 


logo