గురువారం 02 జూలై 2020
Sports - May 12, 2020 , 21:58:37

నాలో ఇంకా క్రికెట్ మిగిలేఉంది: రైనా

నాలో ఇంకా క్రికెట్ మిగిలేఉంది:  రైనా

న్యూఢిల్లీ: త‌న‌లో ఇంకా క్రికెట్ మిగిలే ఉంద‌ని.. దేశానికి ప్రాతినిధ్యం వ‌హించేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నాన‌ని భార‌త వెట‌ర‌న్ బ్యాట్స్‌మ‌న్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకున్నాక యో-యో టెస్టు సైతం పాసైన‌ట్లు ఈ ఆల్‌రౌండ‌ర్ చెప్పుకొచ్చాడు. కొవిడ్‌-19 వ్యాప్తి కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఆట‌గాళ్లంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మంగ‌ళ‌వారం టీమ్ఇండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన రైనా.. త‌న మ‌న‌సులోని మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

`మోకాలి గాయం త‌ర్వాత న‌న్ను నేను పూర్తిగా మార్చుకున్నా. యో-యో టెస్టులోనూ ఉత్తిర్ణ‌త సాధించా. తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నా. క‌ష్ట‌కాలంలో ఎంతో మంతి సీనియ‌ర్ ఆట‌గాళ్లు నాకు అండ‌గా నిలిచారు. ఇప్ప‌టికి నాలో క్రికెట్ మిగిలే ఉంది` అని రైనా చెప్పాడు. ఇక 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో యువ‌రాజ్ పోరాటం అద్వితీయం అని గుర్తుచేసుకున్నాడు.


logo