ఆదివారం 05 జూలై 2020
Sports - May 01, 2020 , 18:24:34

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: అక్తర్​

నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: అక్తర్​

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)తో పాటు దాని న్యాయ సలహాదారుడు తఫాజుల్ రిజ్వీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పాడు. పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్​పై మూడేండ్ల నిషేధం తర్వాత అక్తర్ స్పందిస్తూ.. ఫిక్సింగ్ పట్ల పీసీబీ, దాని న్యాయ బృందం అసమర్థంగా, ఉదాసీనంగా  పనిచేస్తున్నదని విమర్శించాడు. దీంతో పీసీబీ న్యాయ సలహాదారు రిజ్వీ క్రిమినల్, పరువు నష్టం కింద ఫిర్యాదు చేసి అక్తర్​కు నోటీసులు పంపాడు. ఈ సందర్భంగా అక్తర్ శుక్రవారం స్పందించాడు. “అబద్ధాలు, కల్పిత విషయాలతో కూడిన రిజ్వీ పంపిన నోటీసును అందుకున్నా. దాన్ని మా న్యాయవాదికి పంపా. నా తరఫున ఆయన న్యాయపరంగా బదులిస్తారు. రిజ్వి అసమర్థంగా పనిచేస్తున్నారన్న వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా” అని అక్తర్ ట్వీట్​ చేశాడు. అలాగే రిజ్వీపై అక్తర్ చేసిన వ్యాఖ్యలపై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. logo