సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 00:46:56

ఇషాంత్‌ ఇప్పటికీ సోదరుడే: సమీ

ఇషాంత్‌ ఇప్పటికీ సోదరుడే: సమీ

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా క్రికెటర్‌ ఇషాంత్‌శర్మను తాను ఇప్పటికీ సోదరుడిలాగే భావిస్తానని వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సమీ అన్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో సమీని ఉద్దేశిస్తూ ఇషాంత్‌ చేసిన కామెంట్‌ ఇటీవల వివాదంగా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో సమీని ఉద్దేశిస్తూ ‘కాలూ(నల్లని వాడు) అంటూ ఇషాంత్‌ రాసుకొచ్చాడు. వర్ణ వివక్షకు ప్రతీకగా ఉన్న ఈ ఫొటో క్యాప్షన్‌పై తీవ్ర ఆగ్రహానికి గురైన సమీ..ఇషాంత్‌ క్షమాపణ చెప్పాలంటూ కోరిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై సమీ మీడియా మాట్లాడుతూ ‘ఇషాంత్‌పై నాకు ఎలాంటి ఈర్ష్య, అసూయ లేవు. హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన సమయంలో లాగే ఇప్పటికీ ఇషాంత్‌ను సోదరుడిలాగే భావిస్తా. కానీ వర్ణ వివక్షతో ఎవరైనా నా పట్ల దురుసుగా వ్యవహరిస్తే కచ్చితంగా ప్రశ్నిస్తా. వర్ణ వివక్షపై నా అభిప్రాయమేంటో చెప్పాను. ఇప్పటికే క్రికెట్‌లో దీనిపై చర్చ నడుస్తున్నది. వివక్షపై మాట్లాడేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను’ అని అన్నాడు. 


logo