తొలిసారి కలిసినప్పుడే 'ఓకే' చెప్పా : షరపోవా

టెన్నీస్ అందగత్తే, ప్రపంచ మాజీ నంబర్ వన్ మరయా షరపోవా.. తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్తను పెండ్లాడనున్నట్లు వెల్లడించింది. పోష్ ఆర్ట్ డీలర్ అలెగ్జాండర్ గిల్కేస్తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించింది. ఈ జంట గత రెండేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. 17 సంవత్సరాలపాటు టెన్నీస్ ఆడిన ఈ మాజీ రష్యన్ టెన్నిస్ క్రీడాకారిణి.. ఈ ఏడాది ప్రారంభంలో రిటైర్మెంట్ ప్రకటించింది.
'మేం కలిసిన తొలిసారే ఆయన ప్రేమను అంగీకరించాను. ఇది మా చిన్న రహస్యం. కాదంటారా?' అని కాప్షెన్ పెట్టి గిల్కేస్తో దిగిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వీరి ఎంగేజ్మెంట్ వార్త వైరల్ అయింది. అలెగ్జాండర్‌తో ప్రేమలో ఉన్నట్లు చాలా ఏండ్లుగా ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ వార్తలను గతంలో షరపోవా ఒప్పుకోవడంగానీ, ఖండించడంగానీ చేయలేదు.
రష్యాకు చెందిన ఈ అందగత్తె.. టెన్నీస్ ప్రియులకు సుపరిచితురాలే. ఆటకు ఆమె తన అందాన్ని జోడించడంతో ఎందరో ఆమె అభిమానులుగా మారారు. ఐదు గ్రాండ్స్లామ్లతోపాటు ఎన్నో అవార్డులను తన ఖాతాలో వేసుకున్న షరపోవా.. తన అందంతో టీనేజర్ల మనుసు కొల్లగొట్టారు. కాగా, ఎవరూ ఊహించనివిధంగా ఈ ఏడాది తొలినాళ్లలో రిటైర్మెంట్ ప్రకటించారు. స్క్వేర్డ్ కంపెనీ సహయజమాని అయిన అలెగ్జాండర్.. గతంలో ఫ్యాషన్ డిజైనర్ మిషాతో వివాహమైంది. తరువాతికాలంలో వారిద్దరు విడిపోయారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి
- షాకయ్యే చరిత్ర 'ఆపిల్'ది
- రైతుల నిరసనను ఖండించిన మాయావతి
- బోల్తాపడ్డ డీసీఎం.. 70 గొర్రెలు మృతి
- కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న కమలా హ్యారిస్