సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 04, 2020 , 19:46:38

నాకు ప్రైవ‌సీ కావాలి : భ‌జ్జీ‌

 నాకు ప్రైవ‌సీ కావాలి : భ‌జ్జీ‌

సీఎస్‌కే ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ ఆడ‌టం లేద‌ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. "వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ సంవత్సరం ఐపీఎల్ ఆడను. ఇవి కష్ట సమయాలు.. నేను నా కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నప్పుడు కొంత గోప్యతను ఆశిస్తాను. ఈ విష‌యంలో సీఎస్‌కే ఫ్రాంచైజీ నాకు చాలా సాయ‌ప‌డింది. వారికి ఈ ఏడాది ఐపీఎల్ గొప్ప‌గా జ‌రుగాల‌ని కోరుకుంటున్నా.. ప్ర‌తి ఒక్క‌రూ సుర‌క్షితంగా ఉండాలి.. జై హింద్ ” అని హర్భజన్ ట్వీట్ చేశారు.

సీనియర్ బ్యాట్స్‌మెన్ సురేశ్‌ రైనా జ‌ట్టు నుంచి వైదొల‌గిన త‌రువాత హ‌ర్భ‌జ‌న్ కూడా అదే బాట‌లో వెళ్ల‌డం చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు పెద్ద దెబ్బే. భ‌జ్జీ యూఏఈకి వెళ్ల‌కుండా కుటుంబంతో పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్నాడు. తన ప్రాధాన్యతలను అర్థం చేసుకున్నందుకు సీఎస్‌కే యాజమాన్యానికి రుణపడి ఉన్నానని హర్భజన్ అన్నాడు. "నా నిర్ణయం గురించి నేను సీఎస్‌కే యాజ‌మాన్యానికి చెప్పినప్పుడు, వారు చాలా సహాయకారిగా ఉన్నారు. దానికి నేను వారికి రుణ‌ప‌డి ఉంటాను" అని హర్భజన్ అన్నారు. "క్రీడ కంటే కుటుంబానికి ప్రాధాన్య‌త‌నిస్తాను. నా యువ కుటుంబం పైనే ఇప్పుడు నా దృష్టి. కానీ నా హృద‌యం మాత్రం యూఏఈలో ఉంది" అని భ‌జ్జీ చెప్పుకొచ్చాడు. 

"హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల తాను అందుబాటులో ఉండనని మాకు తెలియజేశాడు. టీం చెన్నై సూపర్ కింగ్స్ అతడి నిర్ణయానికి మద్దతుగా ఉంది. ఈ క‌ఠిన స‌మ‌యంలో అత‌డితో పాటు కుటుంబానికి అండగా నిలుస్తుంది" అని సీఎస్‌కే సీఈఓ కాశి విశ్వనాథన్ తెలిపారు. 

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo