సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 26, 2020 , 20:16:33

ఓపెనర్‌గా బరిలోకి దిగడమే ఇష్టం : కేఎల్‌రాహుల్‌

ఓపెనర్‌గా బరిలోకి దిగడమే ఇష్టం : కేఎల్‌రాహుల్‌

చెన్నై : ఓపెనర్‌గా బరిలోకి దిగడమే తనకు ఎంతో ఇష్టమని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ అన్నాడు. ఇలా అయితే మొత్తం 20 ఓవర్లు క్రీజులో ఉండి ఎక్కువ పరుగులు సాధించవచ్చని రాహుల్ తెలిపాడు. భారత్‌లో ఓపెనర్‌గా, వన్‌డౌన్‌లో, నాలుగో స్థానంలో రాహుల్‌ బ్యాటింగ్‌కు వచ్చి సత్తా చాటిన సంగతి తెలిసిందే. 

టీ20ల్లో మాత్రం ఓపెనింగ్‌ బ్యాటింగ్‌కే తన మద్దతు అని రాహుల్‌ తెలిపాడు. ‘ఓపెనర్‌గా క్రీజులోకి రావడాన్ని ఎంతో ఆస్వాదిస్తా. దీనివల్ల 20 ఓవర్లూ బ్యాటింగ్‌ చేయవచ్చు. ఆఖరి వరకు క్రీజులో ఉంటే ఎక్కువ స్కోరు చేయగలను. గత రెండు సీజన్లలో పంజాబ్‌ తరపున మంచి ప్రదర్శన ఇచ్చాను. జట్టుకు మరిన్ని విజయాలు చేకూర్చే విధంగా ప్రయత్నిస్తా’అని రాహుల్‌ అన్నాడు. 

సెప్టెంబర్‌ 19నుంచి యూఏఈలో ఐపీఎల్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo