బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 08, 2020 , 23:22:50

లాక్‌డౌన్ త‌ర్వాతే ఐ-లీగ్‌పై నిర్ణ‌యం

లాక్‌డౌన్ త‌ర్వాతే ఐ-లీగ్‌పై నిర్ణ‌యం

లాక్‌డౌన్ త‌ర్వాతే ఐ-లీగ్‌పై నిర్ణ‌యం

కోల్‌క‌తా: క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ఏర్ప‌డ్డ లాక్‌డౌన్‌తో క్రీడా టోర్నీలు జ‌రుగుతాయా లేదా అన్న‌ది సందిగ్ధంగా మారింది. వైర‌స్ అంత‌కంత‌కు వ్యాప్తి చెందుతున్న క్ర‌మంలో టోర్నీలు ఎప్పుడు మొద‌లవుతాయ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా  ఉంది. కొవిడ్‌-19తో మ‌ధ్య‌లోనే ఆగిపోయిన ఐ-లీగ్ నిర్వ‌హ‌ణ‌పై లాక్‌డౌన్ త‌ర్వాత నిర్ఱయం తీసుకుంటామ‌ని నిర్వాహ‌కులు బుధ‌వారం ప్ర‌క‌టించారు. ఇంకా నాలుగు రౌండ్లు మిగిలున్న లీగ్‌లో మోహ‌న్ బ‌గాన్ జట్టు ఇప్ప‌టికే టైటిల్ ద‌క్కించుకుంది. ‘ ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో తిరిగి మొద‌లుకావ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తున్న‌ది. లీగ్ పూర్తి కావ‌డానికి ఎంత‌లేద‌న్న నెల‌న్న‌ర రోజులు అవ‌స‌రం ప‌డుతుంది. ఈనెల 15 త‌ర్వాత జ‌రిగే స్టేక్ హోల్డ‌ర్ల స‌మావేశంలో లీగ్ నిర్వ‌హ‌ణపై నిర్ఱ‌యం తీసుకుంటాం’ అని అఖిల భార‌త ఫుట్‌బాల్ స‌మాఖ్య‌(ఏఐఎఫ్ఎఫ్‌) స‌భ్యుడు ఒక‌రు అన్నారు. ఇదిలా ఉంటే ఈస్ట్ బెంగాల్, మిన‌ర్వ పంజాబ్‌(23 పాయింట్లు), రియ‌ల్ క‌శ్మీర్‌(22 పాయింట్లు) మ‌ధ్య ర‌న్న‌ర‌ప్ కోసం పోటీ ఉంది. 


logo