ఆదివారం 12 జూలై 2020
Sports - May 06, 2020 , 23:06:33

ఎక్క‌డ ఆపానో.. అక్క‌డి నుంచే మొదలు పెడుతా

 ఎక్క‌డ ఆపానో.. అక్క‌డి నుంచే మొదలు పెడుతా

అభిమానుల ప్ర‌శ్న‌కు విరాట్ కోహ్లీ జ‌వాబు

న్యూఢిల్లీ: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కార‌ణంగా ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)13వ సీజ‌న్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డ‌టంతో ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన ఆట‌గాళ్లు.. సామాజిక మాధ్య‌మాల్లో చురుకుగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బుధ‌వారం టీవీ వ్యాఖ్యాత జ‌తిన్ స‌ప్రూతో లైవ్ చాట్ నిర్వ‌హించాడు. ఇందులో భాగంగా అభిమానుల నుంచి సేక‌రించిన ప్ర‌శ్న‌ల‌కు విరాట్ బ‌దులిచ్చాడు. 

`లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైనా.. సానుకూల దృక్ప‌థంతోనే ముందుకు సాగుతున్నా.. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గి తిరిగి క్రికెట్ సీజ‌న్ ప్రారంభ‌మైతే.. ఎక్క‌డ ఆపానో అక్క‌డి నుంచే ప్రారంభిస్తా. నేనెప్పుడు ఆశావాహంగానే ఆలోచిస్తే.. నెగిటివ్ ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌నివ్వ‌ను` అని కోహ్లీ పేర్కొన్నాడు. 


logo