బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 07, 2020 , 14:46:13

క‌రోనాతో పోరాడ‌గ‌ల‌ను : శిఖ‌ర్ ధావ‌న్‌

క‌రోనాతో పోరాడ‌గ‌ల‌ను : శిఖ‌ర్ ధావ‌న్‌

ఒక‌వేళ త‌న‌కు క‌రోనా సోకినా.. వైర‌స్‌ను జ‌యించే శ‌క్తి త‌న శ‌రీరానికి ఉంద‌ని ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ అన్నాడు. మహమ్మారి కారణంగా క్రికెట్ ఆడటానికి వ‌చ్చిన ధావ‌న్‌కు భ‌యం వేయ‌లేదా? అన్న ప్ర‌శ్న‌కు ఇలా స‌మాధానం ఇచ్చాడు. “నా శరీరంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆడటం పట్ల ఎప్పుడూ భయపడలేదు. వైర‌స్ సోకుతుంద‌ని నాకు తెలుసు.. కానీ నేను దానితో పోరాడ‌గ‌ల‌ను.” అన్నాడు. 

బీసీసీఐ, సంబంధిత ఫ్రాంచైజీలు నిర్ధేశించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆట‌గాళ్లంద‌రూ క‌చ్చితంగా పాటిస్తున్నార‌ని ధావ‌న్ అన్నాడు. తాను కూడా 8-9 సార్లు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని తెలిపాడు. ఈ క‌ఠిన‌మైన స‌మ‌యంలో కూడా బీసీసీఐ ఇంత పెద్ద టోర్నీ నిర్వ‌హించ‌డం నిజంగా అభినంద‌నీయ‌మ‌న్నాడు. 

ఈ ఐపీఎల్‌లో ఢిల్లీ క‌ప్‌ను సాధిస్తుందా? అన్న ప్ర‌శ్న‌కు ధావ‌న్ మాట్లాడుతూ "మేము కలిసి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాం.  కొత్త శ‌క్తిని సృష్టించడం చాలా ముఖ్యం. మాకు చాలా సానుకూల‌త‌లు ఉన్నాయి. ఈసారి క‌ప్ గెలుస్తామ‌ని న‌మ్మ‌కంగా ఉన్నాం.” అని చెప్పాడు. "శ్రేయాస్ గతేడాది జ‌ట్టును బాగా న‌డిపించాడు. ఈసారి జ‌ట్టులోకి ర‌హానే కూడా వ‌చ్చాడు. అశ్విన్ వచ్చాడు. వారు  చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లు." అని ధావ‌న్ అన్నాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo