మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 04, 2020 , 16:59:41

టెస్టుల్లోనూ సత్తాచాటగలను: చాహల్​

టెస్టుల్లోనూ సత్తాచాటగలను: చాహల్​

న్యూఢిల్లీ: ‘’టీమ్​ఇండియా తరఫున టెస్టుల్లోనూ ఆడాలనుందని స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అన్నాడు. 2016లో టీమ్​ఇండియాలో అరంగేట్రం చేసిన చాహల్ ఇప్పటి వరకు 52వన్డేలు, 42 టీ20లు ఆడినా సుదీర్ఘ ఫార్మాట్ అవకాశం రాలేదు. పరిమిత ఓవర్లలో మాత్రం భారత జట్టులో కీలక బౌలర్​గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టెస్టులు ఆడేందుకు కావాల్సిన ఓపిక తనకు పూర్తిగా ఉందని, సంప్రదాయ ఫార్మాట్​లోనూ రాణించగలనని మంగళవారం ఓ ఇంటర్వ్యూలో చాహల్ అన్నాడు.

“నా చివరి 8 రంజీమ్యాచ్​ల్లో 46వికెట్లు తీసుకున్నా. మ్యాచ్​ల్లో నేను 20 నుంచి 25 ఓవర్ల స్పెల్స్ కూడా వేశా. ఎర్ర బంతా, తెల్లబంతా అని నేను ఎక్కువగా ఆలోచించను. నేను ఆటను ఆస్వాదించాలనుకుంటా. ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకునేందుకు నేను ఇష్టపడతా. ప్రతి అవకాశానికి నేను సిద్ధంగా ఉన్నా. టీమ్​ఇండియా తరఫున వన్డేలు, టీ20లు ఆడా. కానీ టెస్టు ప్లేయర్ అని పిలిపించుకుంటే ఆ ఫీలింగే వేరు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో పరుగులు కట్టడి చేసినా చాలు. అయితే టెస్టుల్లో వికెట్ తప్పకతీయాలి. అదే పెద్ద సవాల్​. టెస్టు క్రికెట్ ఆడేందుకు చాలా ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి.  టెస్టులు ఆడేందుకు కావాల్సిన ఆ లక్షణాలు నాలో పుష్కలంగా ఉన్నాయని నేను నమ్ముతా” అని చాహల్ చెప్పాడు. 


logo