మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Aug 06, 2020 , 10:37:25

నాకు క‌రోనా లేదు.. అది అస‌త్య ప్ర‌చారం: ‌లారా

నాకు క‌రోనా లేదు.. అది అస‌త్య ప్ర‌చారం: ‌లారా

న్యూఢిల్లీ: క‌రోనా పాజిటివ్ అని త‌నపై వ‌స్తున్న పుకార్ల‌ను వెస్టిండీస్ మాజీ క్రికెట‌ర్ బ్రియ‌న్ లారా ఖండించారు. తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, నెగెటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. సోష‌ల్ మీడియాలో త‌న‌పై అస‌త్య ప్ర‌చారం జ‌రుగుతున్న‌ద‌ని చెప్పారు. ప్ర‌తికూల‌త‌ను వ్యాప్తిచేయ‌డానికి క‌రోనా మ‌హ‌మ్మారిని ఒక సాధనంగా ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు. 

క‌రోనా పాజిటివ్ అని త‌న గురించి ప్ర‌చార‌మ‌వుతున్న అస‌త్య వార్త‌ల‌ను చ‌దివాన‌ని, వాస్త‌వాల‌ను వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని స్ప‌ష్టం చేశారు. క‌రోనాతో బాధ‌ను అనుభ‌విస్తున్న స‌మాజంలో  ఇలాంటి అస‌త్య వార్త‌ల‌ను ప్ర‌చారం చేసి, భ‌యాందోళ‌న‌ల‌ను వ్యాప్తిచేయ‌డం మంచిదికాద‌ని సూచించారు. ఇలాంటి వార్త‌ల‌తో త‌న‌ను ఏమాత్రం ప్ర‌భావితం చేయలేర‌ని అన్నారు. కానీ త‌న చుట్టూ ఉన్న‌వారిని మాత్రం ఆందోళ‌న‌కు గురిచేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


logo