శుక్రవారం 05 మార్చి 2021
Sports - Feb 20, 2021 , 00:41:58

15 కోట్లంటే ఎంతో..?

15 కోట్లంటే ఎంతో..?

క్రైస్ట్‌చర్చ్‌: ఐపీఎల్‌ వేలంలో రూ.15 కోట్లు  దక్కాయని తెలిసినా.. న్యూజిలాండ్‌ కరెన్సీలో అది ఎంత మొత్తమో తనకు అర్థం కాలేదనని ఆ దేశ పేసర్‌ కైల్‌ జెమీసన్‌ చెప్పాడు. ‘అర్ధరాత్రి (న్యూజిలాండ్‌లో) నిద్రలేచి ఫోన్‌లో ఐపీఎల్‌ వేలం చూశా. గంటన్నర తర్వాత నా పేరు వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో జెమీసన్‌ చెప్పాడు. ఆ తర్వాత తనకు కివీస్‌ మాజీ పేసర్‌ షేన్‌ బాండ్‌ నుంచి మెసేజ్‌ వచ్చిందని జెమీసన్‌ అన్నాడు. చాలా మంచి మొత్తం దక్కిందని బాండ్‌ పేర్కొన్నాడని తెలిపాడు. ‘నాకు అది ఎంత ధరో తెలియదు. న్యూజిలాండ్‌ కరెన్సీలో ఎంతో కూడా చెక్‌ చేసుకోవడం రాలేదు’ అని జెమీసన్‌ అన్నాడు. పోటాపోటీగా జరిగిన వేలంలో రూ.15 కోట్లకు జెమీసన్‌ను బెంగళూరు దక్కించుకున్న సంగతి తెలిసిందే. 

VIDEOS

logo