శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 24, 2020 , 23:15:55

ఆర్​సీబీని ఎప్పటికీ వదల్లేను: కోహ్లీ

ఆర్​సీబీని ఎప్పటికీ వదల్లేను: కోహ్లీ

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో తాను సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్​సీబీ) జట్టును తాను ఎప్పటికీ వదిలి వెళ్లలేనని విరాట్ కోహ్లీ చెప్పాడు. అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమ, నమ్మకమే ఇందుకు కారణమన్నాడు. ఆర్​సీబీ బ్యాట్స్​మన్​, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్​, విరాట్ కోహ్లీ శుక్రవారం ఇన్​స్టాగ్రామ్ లైవ్​ ద్వారా పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. “ఆర్​సీబీతో ప్రయాణం అద్భుతంగా సాగుతున్నది. అందరం కలిసి ఐపీఎల్​ టైటిల్ గెలువాలన్నదే నా కల. ఈ జట్టును వదిలిపెట్టి వెళ్లాలన్న ఆలోచనే ఎప్పుడూ రాలేదు, వచ్చే అవకాశామే లేదు. ఐపీఎల్ ఆడుతున్నంత కాలం నేను జట్టును వదిలివెళ్లను. మాపై అభిమానుల ప్రేమ, నమ్మకం అద్భుతం” అని కోహ్లీ అన్నాడు. ఈ సందర్భంగా డివిలియర్స్ సరదాగా మాట్లాడాడు. “నేను కూడా ఆర్​సీబీ వదిలివెళ్లకూడదని అనుకుంటున్నా. అలా చేయాలంటే నేను తప్పకుండా పరుగులు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే నేను కెప్టెన్ కాదు కదా” అని కోహ్లీతో డివిలియర్స్ అన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైన 2008 నుంచి కోహ్లీ ఆర్​సీబీ తరఫునే ఆడుతుండగా.. డివిలియర్స్ తొమ్మిదేండ్లుగా ఆ జట్టుతోనే ఉన్నాడు. 


logo