ఆదివారం 17 జనవరి 2021
Sports - Nov 28, 2020 , 14:54:27

రాహుల్‌కు సారీ చెప్పాన‌న్న మ్యాక్స్‌వెల్‌

రాహుల్‌కు సారీ చెప్పాన‌న్న మ్యాక్స్‌వెల్‌

సిడ్నీ: ఆస్ట్రేలియా, ఇండియా తొలి వ‌న్డే చూసిన త‌ర్వాత చాలా మంది అభిమానులు ఆసీస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, స్టీవ్ స్మిత్‌, ఆరోన్ ఫించ్‌ల‌ను తిట్టుకునే ఉంటారు. ఐపీఎల్‌లో భారీ రేట్ల‌కు అమ్ముడుపోయిన ఈ ప్లేయ‌ర్స్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంచైజీల ఆశ‌ల‌ను వ‌మ్ము చేశారు. ముఖ్యంగా కింగ్స్ పంజాబ్ టీమ్ త‌ర‌ఫున ఆడిన మ్యాక్స్‌వెల్ అయితే మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి కేవ‌లం 108 ప‌రుగులే చేశాడు. దీంతో అత‌నిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సెహ్వాగ్ అయితే ప‌ది కోట్ల చీర్ లీడ‌ర్ అంటూ అత‌న్ని హేళన చేశాడు. అలాంటి మ్యాక్సీ.. ఇండియాతో మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయి ఆడాడు. కేవ‌లం 19 బంతుల్లోనే 45 ప‌రుగులు చేశాడు. ఐపీఎల్ సీజ‌న్ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా బాద‌ని మ్యాక్స్‌వెల్‌.. ఈ ఇన్నింగ్స్‌లో మూడు కొట్ట‌డం విశేషం. దీంతో సోష‌ల్ మీడియాలో అభిమానులు మ్యాక్సీని ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. నీ వెన‌కే రాహుల్ ఉన్నాడు చూసుకో అన్న‌ట్లుగా పోస్ట్‌లు పెట్టారు. పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌.. మ్యాక్సీపై భారీ ఆశ‌లే పెట్టుకున్నా అత‌డు మాత్రం తీవ్రంగా నిరాశ ప‌రిచాడు. అయితే తొలి వ‌న్డే సంద‌ర్భంగా తాను రాహుల్‌కు సారీ చెప్పిన‌ట్లు మ్యాక్స్ వెల్ ట్విట‌ర్‌లో చెప్పాడు. నేను బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో రాహుల్‌కు క్ష‌మాప‌ణ చెప్పాను అని ఓ ట్వీట్ చేశాడు. కివీ బ్యాట్స్‌మ‌న్ జిమ్మీ నీష‌మ్ షేర్ చేసిన ఓ మేమ్‌పై మ్యాక్సీ ఇలా స్పందించాడు.