శుక్రవారం 05 మార్చి 2021
Sports - Feb 07, 2021 , 21:37:00

త్వరలో స్పోర్ట్స్‌ అకాడమీ ప్రారంభిస్తా: అశోక్‌ దిండా

త్వరలో స్పోర్ట్స్‌ అకాడమీ ప్రారంభిస్తా: అశోక్‌ దిండా

న్యూఢిల్లీ: భారత పేస్‌ బౌలర్‌ అశోక్ దిండా ఇటీవల క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.  వన్డే, టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. త్వరలో క్రికెట్‌ అకాడమీని ప్రారంభించనున్నట్లు  బెంగాల్‌ మాజీ క్రికెటర్‌ అశోక్‌ దిండా  ప్రకటించాడు. 

ఆటగాళ్లకు 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.  'దిండా అకాడమీ ఆఫ్‌ పేస్‌ బౌలింగ్'‌ అని శిక్షణా అకాడమీకి పేరుపెట్టనున్నట్లు తెలిపాడు. మరొకొన్ని నెలల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. దశాబ్దకాలానికి పైగా దేశవాళీ క్రికెట్‌లో రాణించిన దిండా యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వివరించాడు. 

VIDEOS

logo