గురువారం 09 ఏప్రిల్ 2020
Sports - Mar 27, 2020 , 13:48:25

ఎక్కువ మంది ప్రేమను పొందుతున్నది నేనే: అక్తర్

ఎక్కువ మంది ప్రేమను పొందుతున్నది నేనే: అక్తర్

పాకిస్థాన్​తో పాటు భారత్​లోనూ ఎక్కువ మంది తనను ప్రేమిస్తున్నారని రావల్పిండి ఎక్స్​ప్రెస్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. అందుకే తాను పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్​(పీఎస్​ఎల్​) బ్రాండ్ వాల్యూను విశ్వవ్యాప్తం చేయగలనని శుక్రవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. పీఎస్​ఎల్​లో మరో రెండు జట్లను చేరిస్తే బాగుంటుందంటూనే.. తానూ ఓ జట్టును సొంతం చేసుకోవాలనే కోరికను అక్తర్​ బయటపెట్టాడు.

పాకిస్థాన్​తో పాటు సరిహద్దుల అవతల(భారత్​) కూడా ఎక్కువ మంది ప్రేమను పొందుతున్నా. ప్రజలకు నా గురించి బాగా తెలుసు. నాకు ఓ జట్టు ఉంటే పీఎస్​ఎల్ బ్రాండ్​వాల్యూను విశ్వవ్యాప్తం చేస్తా. ప్రపంచ నలుమూలల నుంచి పీఎస్​ఎల్​లోకి పెట్టుబడులు కూడా తేగలను     -  అక్తర్

అలాగే పీఎస్​ఎల్​లో రెండు కొత్త జట్లను పీసీబీ ప్రకటించాలని అక్తర్ సూచించాడు. అలా చేస్తే తాను ఓ జట్టును సొంతం చేసుకునేందుకు ముందుకొస్తానని మనసులో మాట బయటపెట్టాడు. 


logo