సోమవారం 01 మార్చి 2021
Sports - Feb 23, 2021 , 02:44:56

తన్మయ్‌ సూపర్‌ సెంచరీ

 తన్మయ్‌ సూపర్‌ సెంచరీ

  • ఛత్తీస్‌గఢ్‌పై హైదరాబాద్‌ గెలుపు 
  • విజయ్‌ హజారే ట్రోఫీ 

సూరత్‌: కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (116 బంతుల్లో 122; 15ఫోర్లు, ఓ సిక్స్‌ ) శతకంతో రెచ్చిపోవడంతో  విజయ్‌ హజారే ట్రోఫీలో హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం సాధించింది.  సోమవారం ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన్మయ్‌తో పాటు తిలక్‌ వర్మ  (60) అదరగొట్టడంతో హైదరాబాద్‌ 7వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ఛత్తీస్‌గఢ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పో యి 242 పరుగులు చేసింది.  మెహదీ హసన్‌  మూడు వికెట్లు పడగొట్టాడు. హర్‌ప్రీత్‌ సింగ్‌ (63), అషుతోష్‌ సింగ్‌ (51) అర్ధశతకాలతో రాణించారు. లక్ష్యఛేదనలో తన్మయ్‌, తిలక్‌ వర్మ   అర్ధశతకంతో అదరగొట్టడంతో తొలి వికెట్‌కు 131 పరుగులు పార్ట్‌నర్‌షిప్‌ వచ్చింది. హిమాలయ్‌ అగర్వాల్‌ (49) కూడా రాణించడంతో  40.4 ఓవర్లలో హైదరాబాద్‌ లక్ష్యాన్ని ఛేదించింది.  

శ్రీశాంత్‌ 15ఏండ్ల తర్వాత 

లిస్ట్‌-ఏ కెరీర్‌లో దాదాపు 15 ఏండ్ల తర్వాత ఐదు వికెట్ల ప్రదర్శనతో శ్రీశాంత్‌ (5/65) రెచ్చిపోవడంతో ఉత్తరప్రదేశ్‌పై కేరళ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది.

VIDEOS

logo