బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Jan 29, 2020 , 00:21:16

హైదరాబాద్‌కు ఆధిక్యం

హైదరాబాద్‌కు ఆధిక్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ స్టేడియం వేదికగా రాజస్థాన్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు ఆధిక్యం లభించింది. సొంతగడ్డపై పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న హైదరాబాద్‌ ప్రస్తుతం 137 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. రాజస్థాన్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఓపెనర్‌ అక్షత్‌రెడ్డి (43 నాటౌట్‌) ఆకట్టుకోవడంతో రెండో రోజు ఆట ముగిసే సరికి హైదరాబాద్‌ 101/6 స్కోరు చేసింది. అనికేత్‌ చౌదరి (3/26) రాణించాడు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 2/0తో తొలి ఇన్నింగ్స్‌కు దిగిన రాజస్థాన్‌.. హైదరాబాద్‌ బౌలర్లు రవికిరణ్‌ (4/46), మిలింద్‌ (2/36), సాయిరామ్‌(2/9) ధాటికి 135 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ అశోక్‌ మనేరియా(42) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. 


logo