శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 31, 2020 , 21:14:27

సన్‌రైజర్స్‌ బౌలర్ల హవా..బెంగళూరు స్కోరు 120/7

సన్‌రైజర్స్‌ బౌలర్ల హవా..బెంగళూరు స్కోరు  120/7

షార్జా:  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో  కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ బౌలర్లు మెరిశారు. సందీప్‌ శర్మ(2/20), జేసన్‌ హోల్డర్‌(2/27) ధాటికి బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్లకు 120 పరుగులు చేసింది. ఓపెనర్‌ జోష్‌ ఫిలిప్‌(32: 31 బంతుల్లో 4ఫోర్లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ఏబీ డివిలియర్స్‌(24), వాషింగ్టన్‌ సుందర్‌(21) మాత్రమే  ఫర్వాలేదనిపించారు. 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు  ఆట చప్పగా సాగింది.  ఆరంభం నుంచే  హైదరాబాద్‌ బౌలర్లు ప్రత్యర్థిని అదుపులో ఉంచారు.    పిచ్‌పై పరుగులు సాధించేందుకు బ్యాట్స్‌మెన్‌ తెగ కష్టపడ్డారు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌(5), విరాట్‌ కోహ్లీ(7) విఫలమయ్యారు.

కనీసం డెత్‌ ఓవర్లలో కూడా  బెంగళూరు విజృంభించలేకపోయింది. గుర్‌కీరత్‌ సింగ్‌ ఆఖరి వరకు క్రీజులో ఉన్నా 24 బంతుల్లో కేవలం 15 పరుగులే చేశాడు. నటరాజన్‌(1/11) బెంగళూరును బాగా ఇబ్బంది పెట్టాడు. నదీమ్‌(1/35), రషీద్‌ ఖాన్‌(1/24) కూడా  పదునైన బంతులతో  ప్రత్యర్థి స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేయకుండా అడ్డుకున్నారు.