సోమవారం 06 జూలై 2020
Sports - Jun 04, 2020 , 21:46:15

హైదరాబాద్‌ ఓపెన్‌ రద్దు

హైదరాబాద్‌ ఓపెన్‌ రద్దు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో.. హైదరాబాద్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్లూ్యఎఫ్‌) ఇటీవల సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 11 నుంచి 16 వరకు సూపర్‌-100 హైదరాబాద్‌ ఓపెన్‌ జరుగాల్సి ఉన్నా.. కొవిడ్‌-19 విజృంభిస్తుండటంతో టోర్నీని రద్దు చేశారు. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌కు ముందు క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లకు తగినంత సమయం లేకపోవడంతో.. బీడబ్లూ్యఎఫ్‌ కీలకమైన టోర్నమెంట్లను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ బ్యాడ్మింటన్‌ కోచ్‌ గోపీచంద్‌ మాట్లాడుతూ..

‘తెలంగాణలో లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా ఈవెంట్‌లకు ఇంకా అనుమతివ్వలేదు. దీంతో పాటు ప్రస్తుతం మహమ్మారి విజృంభణ ఇంకా ఎక్కువవుతున్నది. ఇలాంటి సమయంలో టోర్నీ నిర్వహించడం సరైని నిర్ణయం కాదు’ అని పేర్కొన్నాడు. 

 


logo