మంగళవారం 31 మార్చి 2020
Sports - Jan 25, 2020 ,

హైదరాబాద్‌, ముంబై మ్యాచ్‌ డ్రా

హైదరాబాద్‌, ముంబై మ్యాచ్‌ డ్రా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో భాగంగా స్థానిక గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం హైదరాబాద్‌, ముంబై మధ్య మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. గత కొన్ని మ్యాచ్‌ల్లో వరుస ఓటములతో సతమతమవుతున్న హైదరాబాద్‌కు ఆఖర్లో అదృష్టం కలిసొచ్చింది. మ్యాచ్‌ అదనపు సమయం(94ని)లో దక్కిన పెనాల్టీని మార్కో స్టాంకోవిచ్‌ గోల్‌ చేయడంతో హైదరాబాద్‌ ఓటమి నుంచి తప్పించుకుంది. ఆది నుంచే దూకుడు ప్రదర్శించిన ముంబై జట్టులో మహమ్మద్‌ లర్బి(43ని) గోల్‌ చేశాడు. హైదరాబాద్‌ డిఫెన్స్‌ లోపాలను ఎత్తిచూపుతూ ముంబై వరుస దాడులకు పాల్పడింది.


logo
>>>>>>