శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 30, 2020 , 00:17:02

సొంతగడ్డపై శుభారంభం

 సొంతగడ్డపై శుభారంభం

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో సొంతగడ్డపై హైదరాబాద్‌ హంటర్స్‌ శుభారంభం చేసింది. నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో బుధవారం ప్రారంభమైన హైదరాబాద్‌ అంచె పోటీల టైలో నార్త్‌ఈస్ట్‌ వారియర్స్‌పై సింధుసేన 2-1తో గెలిచింది. తొలుత మిక్స్‌డ్‌డబుల్స్‌లో ఎన్‌.సిక్కిరెడ్డి- వ్లాదిమర్‌ ఇవనోవ్‌ జోడీ ఆతిథ్య జట్టు గెలుపు ఖాతా తెరిచింది. ఆ తర్వాత ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల సింగిల్స్‌లో సౌరభ్‌ వర్మ 14-15, 14-15తేడాతో వారియర్స్‌ ప్లేయర్‌ తనోంగ్సక్‌ చేతిలో ఓడడంతో హైదరాబాద్‌  ఆధిక్యం కోల్పోయింది.


 ఆ తర్వాత స్టార్‌ ప్లేయర్‌, హంటర్స్‌ కెప్టెన్‌ పీవీ సింధు 8-15, 9-15తేడాతో మిషెల్లీ చేతిలో ఓడడంతో నార్త్‌ఈస్ట్‌ ముందంజ వేసింది. ఆ తర్వాత ప్రత్యర్థి ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంపిక చేసుకున్న పురుషుల డబుల్స్‌లో హైదరాబాద్‌ జోడీ బెన్‌ లెన్‌ - ఇవనోవ్‌ విజయం సాధించింది. నిర్ణయాత్మక ఆఖరి పురుషుల సింగిల్స్‌ పోటీలో హంటర్స్‌ ప్లేయర్‌ డారెన్‌ లీ 15-9, 15-10తో లీ చెక్‌యూపై పైచేయి సాధించి, జట్టును గెలిపించాడు. లక్నోలో జరిగిన గత మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 


logo