సోమవారం 18 జనవరి 2021
Sports - Jan 09, 2021 , 00:35:48

హైదరాబాద్‌ గోల్స్‌ షో

హైదరాబాద్‌ గోల్స్‌ షో

పనాజీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీ గోల్స్‌ మోత మోగిస్తున్నది. గత మ్యాచ్‌లో నాలుగు గోల్స్‌ చేసిన హైదరాబాద్‌.. శుక్రవారం అదే జోరు కొనసాగిస్తూ నార్త్‌ఈస్ట్‌పై 4-2తో విజయం సాధించింది. హైదరాబాద్‌ తరఫున లిస్టన్‌ కొలాకో (85, 90వ నిమిషాల్లో) డబుల్‌ గోల్స్‌ చేయగా.. అరిడానే (3వ ని.లో), జోయల్‌ జోసెఫ్‌ (36వ ని.లో) చెరో గోల్‌ చేశారు.