హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. గత సీజన్లో అంచనాలకు మించి ఫలితాలు సాధించిన హెచ్ఎఫ్సీ అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా నిలకడగా రాణిస్తున్న 16 ఏండ్ల యువ గోల్‌కీపర్ అభినవ్ ములగడతో తాజాగా ఒప్పందం చేసుకుంది. ఒక హైదరాబాదీ ప్లేయర్‌తో కాంట్రాక్టు కుదుర్చుకోవడం హెచ్‌ఎఫ్‌సీకి ఇదే తొలిసారి.